Namaste NRI

ఆస్ట్రేలియాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్

బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ టోర్నమెంట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన 28 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల పాటు ఈ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో భాగంగా సెప్టెంబర్‌ 16,17వ తేదీల్లో గ్రాండ్‌ ఫైనల్‌ను అంగరంగ వైభవంగా జరుపుతామన్నారు . భారత్‌కు చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవంలో భాగంగా  తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై విక్టోరియా స్టేట్‌ కన్వీనర్‌ సాయిరాం ఉప్పు చేసిన పవర్‌ ప్రజెంటేషన్‌ పలువురిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవంలో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర మంత్రిప్రగడ, వినయ్‌ సన్నీ గౌడ్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events