Namaste NRI

కేసీఆర్‌ది క‌ర్ష‌కుల బ‌డ్జెట్ .. మోదీది కార్పొరేట్ల బ‌డ్జెట్

కేంద్ర బడ్జెట్‌కు,  తెలంగాణ బడ్జెట్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ  కోట్లాదిమంది నిరుపేదలకు ఉపాధిని, ఆదాయాన్ని కలుగజేసిన గ్రామీణ ఉపాధి హామీ ప‌థకానికి కేంద్ర బడ్జెట్‌లో అతి తక్కువ కేటాయింపు చేస్తే, తెలంగాణ బడ్జెట్ మాత్రం సబ్బండ వర్ణాలకు సముచిత ప్రాధాన్యం కల్పించింద‌న్నారు. రైల్వేస్టేషన్‌లు, రైలు మార్గాలను ప్రైవేటీకరించబోతూ, వాటిపైన రూ. 2.4 లక్షల కోట్లు ఖర్చు చేయడ‌మంటే ప్రభుత్వ ఖర్చుతో  ప్రైవేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చడమే అని అన్నారు.

గత ఎనిమిదిన్నరేళ్లుగా ప్ర‌జ‌ల‌కు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలకు కొనసాగింపుగానే ఈ చివరి బడ్జెట్‌ కూడా ఉందని అన్నారు. కానీ కేసిఆర్ బడ్జెట్ మాత్రం అన్ని రంగాలకు చేయుత‌నిచ్చేలా ఉందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రైతాంగం, వ్యవసాయరంగం పట్ల మోదీ చిన్న‌చూపు చూడ‌డం స్పష్టంగా క‌న‌ప‌డుతుంద‌ని అన్నారు. అదే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రైతాంగం, వ్యవసాయ రంగానికి పెద్ద‌పీట వేసి కేసీఆర్ రైతు పక్షపాతి అని నిరూపించుకున్నార‌ని  పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events