డ్రైవింగ్ లైసెన్స్, బీమా లేకుండానే ఒక వ్యక్తి 70 ఏండ్లకు పైగా కారు నడుపుతున్నాడు. బ్రిటన్‌లోని నాటింగ్‌హోమ్‌లో ఈ ఘటన జరిగింది. పెట్రోలింగ్ పోలీసులు బుల్‌వెల్‌లోని టెస్కో ఎక్స్‌ట్రా సమీపంలో ఒక కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. వాహనం డాక్యుమెంట్లు, బీమా, అతడి డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు చూపాలని అడిగారు. అయితే అవేమీ తన వద్ద లేవని అతడు చెప్పాడు. 1938లో పుట్టిన తాను 12 ఏండ్ల వయసు నుంచి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్, బీమా లేకుండానే కారును నడుపుతున్నట్లు తెలిపారు. తనను ఎప్పుడూ పోలీసులు అడ్డకోలేదని అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం కూడా జరుగలేదని వెల్లడిరచారు. దాంతోనే సుదీర్ఘకాలం ఇలా రోడ్డుపై హాయిగా తిరిగేశాడు. అతనికి 12ఏళ్ల వయసు నుంచే కారుకు బీమా లేకుండా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ ఘటనపై బుల్‌వెల్, రైజ్‌పార్క్ హైబరీ వేల్ పోలీసులు ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఆ స సమయంలో ఆ వ్యక్తి ఓ పాత తుప్పు పట్టినకారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా గుర్తించారు. వెంటనే ఆ కారు నడిపే వ్యక్తిని అడ్డుకున్నారు. తర్వాత విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు పోలీసులు.