అగ్ర కథానాయిక కీర్తి సురేష్ పెళ్లి గురించి కొంతకాలంగా సోషల్‌మీడియాలో వార్తలొస్తున్నాయి. తన కాలేజీ ఫ్రెండ్‌తో ఈ భామ ప్రేమలో ఉందని, త్వరలో అతన్ని పెళ్లాడనుందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యం లో తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన చేసింది. ప్రియుడు ఆంటోనీతో దీపావళి సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
ఇక అభిమానులు ఆంటోని వ్యక్తిగత వివరాల గురించి సోషల్‌మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాలేజీ రోజుల నుంచే కీర్తి సురేష్-ఆంటోని మంచి స్నేహితులని తెలిసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆంటోని కొంతకాలం విదేశాల్లో ఉద్యోగాలు చేశాడని, ప్రస్తుతం కేరళలో పలు వ్యాపా రాలను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇరు కుటుంబాల అనుమతితోనే కీర్తి సురేష్ తన రిలేషన్‌షిప్‌పై ప్రకటన చేసిందని, త్వరలో ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని తెలుస్తున్నది.