తమిళ దర్శకుడు చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో కీర్తీ సురేష్ లీడ్ రోల్ లో నటిస్తున్నది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు రివాల్వర్ రీటా పేరును ఫిక్స్ చేస్తూ రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్‌ను పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌ను విడుదల చేశారు. పెయింటింగ్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మహిళ ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ది రూట్, ప్యాషన్ స్టూడీయోస్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
