ద్వీపకల్ప దేశం బాలీని సందర్శించే టూరిస్టులు ఇకపై ఎంట్రీ ఫీజు కింద 10 డాలర్లు (సుమారు రూ.820) చెల్లించాల్సి ఉంటుంది. 2024 ఫిబ్రవరి నుండి ఈ నిబంధన అమలులోకి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ నిధులను పగడపు దిబ్బలు, మడ అడవులు, ఇతర స్థిరమైన ప్రాజెక్టుల పరిరక్షణకు వినియోగిస్తామని టూరిజం కార్యాలయ అధిపతి త్జోకోర్డా బాగస్ పెమాయున్ తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర నియమ నిబంధనలు ఇంకా చర్చల దశలో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
