Namaste NRI

సౌదీ అరేబియా కీలక ప్రకటన.. ఏడాది పాటు  

 సౌదీ అరేబియా సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు వీసా వెసులుబాటులు కల్పిస్తున్న సౌదీ తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విజిటర్లు ఏకంగా ఏడాది పాటు విదేశీ డ్రైవింగ్ లైసెన్స్‌ ను ఉపయోగించుకునే వీలు కల్పించింది. ఈ మేరకు సౌదీ ట్రాఫిక్ విభాగం  తాజాగా కీలక ప్రకటన చేసింది. విదేశీ సందర్శకులు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్  లేదా చెల్లుబాటు అయ్యే విదేశీ లైసెన్స్ కలిగి ఉంటే, దేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి ఒక ఏడాది పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను ఉపయోగించుకోవచ్చని సౌదీ జనరల్ ట్రాఫిక్ విభాగం తన ప్రకటనలో పేర్కొంది.

జూలైలో సౌదీ అరేబియా  బిజినెస్ విజిట్ ఎలక్ట్రానిక్ వీసా ను ప్రారంభించింది. దీనిని విజిటింగ్ ఇన్వెస్టర్ వీసా అంటారు. సౌదీ అరేబియాలోని పెట్టుబడి అవకాశాలను అర్థం చేసుకునేందుకు విదేశీయులు ఆ దేశానికి వెళ్లేందుకు వీలు కల్పించే లక్ష్యంతో విజిటింగ్ ఇన్వెస్టర్ వీసా ను తీసుకురావడం జరిగింది. ఇక సౌదీ సర్కార్ ఈ ఏడాది మొత్తంగా 25 మిలియన్ల విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events