విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ముఖ్య గమనిక. వేణు మురళీధర్ దర్శకుడు. లావణ్య కథానా యిక. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ విరాన్ నాతో పాటు అల్లు అర్జున్ సినిమా కథలు వినేవాడు. బన్నీకి విరాన్ అంటే చాలా ఇష్టం. ఏదైనా కొత్త కథ వినాల్సివస్తే విరాన్‌ను పిలవండని చెప్పేవాడు. విరాన్ హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. బన్నీ వాసు సినీ ప్రయాణాన్ని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని హీరో విరాన్ ముత్తంశెట్టి అన్నారు. ఓ వినూత్నమైన కథతో సినిమాను తెరకెక్కించామని, కొత్తవారైనా ఆర్టిస్టులం దరూ చక్కటి నటన కనబరిచారని దర్శకుడు వేణు మురళీధర్ చెప్పారు. ఈ నెల 23న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వెన్న, నిర్మాణ సంస్థ: శివిన్ ప్రొడక్షన్స్.