అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పాలనా యంత్రాంగంలో భారతీయులకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. తన యంత్రాంగంలో భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పజెబుతున్నారు. తాజాగా తన పాలనా యంత్రాంగంలో మరో 11 మందిని నియమించాలని భావిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. అందులో ఇద్దరు ఇండో అమెరికన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. భారతీయ అమెరికన్లు రాహుల్ గుప్తా, అతుల్ గవాండే ఆ జాబితాలో ఉన్నారు. రాహుల్ గుప్తాను నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరక్టర్‌గా, అతుల్ గవాండేను బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించనున్నారు.భారత్‌లో జన్మించిన రాహుల్ గుప్తా, వాషింగ్టన్లో పెరిగారు. ఆయన ప్రజారోగ్య విధానాలపై అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, టాస్క్ ఫోర్సులకు సలహాదారుగా పనిచేస్తున్నారు.