దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారత సంతతికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఇమ్తియాజ్ అహ్మద్ ఫేజల్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పింది. దక్షిణాఫ్రికా ఇంటెలిజెన్స్ శాఖకు ఆయనను ఇన్స్‌ఫెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా నేషనల్ అసెంబ్లీ ఫేజల్‌ను కీలక పదవికి నామినేట్ చేసింది. దేశంలో నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే సెక్యూరిటీ ఏజెన్సీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగాల అధికారులపై నేరుగా దర్యాప్తుకు ఆదేశించే అధికారం ఇన్ఫెక్టర్ జనరల్‌కు ఉంది.ఈ పదవి కోసం మొత్తం 25 మంది సీనియర్ అధికారులు దరఖాస్తు చేసుకోగా..చివరకు అహ్మద్ ఫేజల్ ఇన్ఫెక్టర్ జనరల్‌గా ఎంపికయ్యారు. నేషనల్ అసెంబ్లీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఫైజల్ నామినేషన్‌కు ఆమోదముద్ర వేశారు. అయితే.. ఫేజల్ నియామకపత్రంపై దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా సంతకం చేయాల్సి ఉంది.