ప్రముఖ నిర్మాత దిల్‌రాజును కీలక పదవి వరించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్యూలు జారీ చేశారు. ఈ పదవిలో దిల్‌రాజు రెండేళ్లపాటు కొనసాగుతారు. దిల్‌రాజు అసలు పేరు వి.వెంకటరమణారెడ్డి. పెళ్లి పందిరి (1997) సినిమాతో పంపిణీదారునిగా ఆయన సినీ కెరీర్ మొదలైంది. దిల్, ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలతో అగ్రనిర్మాతగా ఎదిగారాయన. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై యాభైకి పైగా చిత్రాలు నిర్మించారు.