ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కిమ్ మంగళవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆయుధ అంశాలపై చర్చల కోసమే ఆయన రష్యాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పుతిన్‌తో కిమ్ భేటీ ఎప్పుడు, ఎక్కడ అన్నది మాత్రం తెలియరాలేదు. కిమ్ ఆదివారం సాయంత్రమే ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి విలాసవంతమైన రైల్లో రష్యాకు బయలు దేరినట్లు తెలిసింది. కాగా, రష్యాకు కిమ్ రావడం ఇది రెండోసారి. 2019లో ఆయన మొదటిసారి ఆదేశాన్ని విజిట్ చేశారు. ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని రష్యా నగరమైన వ్లాదివోస్కీలో రష్యా అధ్యక్షుడితో ఆయన భేటీ అయ్యారు. కిమ్ అప్పుడు కూడా ఇలానే విలాసవంతమైన రైల్లో 20 గంటల పాటుప్రయాణించారు. ఈ సారి కూడా ఆ నగరంలోనే భేటీ ఉండొచ్చని తెలుస్తోంది. పుతిన్ ఆహ్వానం మేరకు ఆయన క్రెమ్లిన్ వెళ్లినట్లు సమాచారం.