Namaste NRI

పుతిన్‌కు గ్రాండ్ వెల్క‌మ్ ప‌లికిన కిమ్‌

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఉత్త‌ర కొరియా చేరుకున్నారు. రాజ‌ధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. నార్త్ కొరియా దేశాధినేత‌ కిమ్ జాంగ్ ఉన్,  పుతిన్‌ను సాద‌రంగా ఆహ్వానించారు. దాదాపు 9 గంట‌ల పాటు పుతిన్, ఉత్త‌ర కొరియాలో ఉండ‌నున్నారు. ఆ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య 90 నిమిషాల పాటు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త సెప్టెంబ‌ర్‌లో ర‌ష్యాలో ఈ ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న ర‌ష్యాకు,  కీల‌క‌మైన ఆయుధాల‌ను ఉత్త‌ర కొరియా స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మిలిట‌రీ బంధాన్ని బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

పుతిన్ రాక సంద‌ర్భంగా సెంట్ర‌ల్ స్క్వేర్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా డెక‌రేట్ చేశారు. కిమ్ సంగ్ స్క్వేర్ వ‌ద్ద రంగురంగు ల బెలూన్లు ఎగురుతున్నాయి. భారీ ఎత్తున ప‌రేడ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. చిన్న పిల్ల‌లు బెలూన్లు ప‌ట్టుకు న్నారు. ప‌రేడ్ జ‌రిగే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌ల‌ను ర‌ష్యా, నార్త్ కొరియా జెండాల‌తో అలంక‌రించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events