రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరుదైన కొరియన్ జాతి శునకాలను కిమ్ జాంగ్ ఉన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్యోంగ్‌యాంగ్‌లో చర్చలు జరిగిన సమయంలో ఇద్దరు నేతలు ఒకరి ఒకరు పలు రకాల బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి ఉత్తర కొరియా పర్యటించారు. ఆయన రెండు ఆసియా దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక, భద్రతా, రాజకీయ అంశాలపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు.
ఫుంగ్‌సన్ జాతికి చెందిన శునకాలను పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో ఉత్తర దిక్కున్న కొండ ప్రాంతాల్లో ఫుంగ్‌సన్ జాతి శునకాలు నివసిస్తుంటాయి. మంచును తట్టుకునే చర్మం వాటికి ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులను కూడా అవి ఢీకొట్టగలవు. కొరియాలో వీటిని హంటింగ్ డాగ్స్ వాడుతుంటారు. ప్యోంగ్‌యాంగ్‌లో భారీ ఎత్తున పుతిన్‌కు కిమ్ వెల్కమ్ పలికిన విషయం తెలిసిందే.