కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢల్లీిలోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ కేబినెట్‌లో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 25 నెలల ఏడు రోజుల వ్యవధిలోనే కిషన్‌రెడ్డి పదోన్నతి పొందారు. తెలంగాణ ఆవిర్భవించాక కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి కేబినెట్ హోదా దక్కించుకున్న తొలి నేతగా గుర్తింపు పొందారు.