ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కేబినెట్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా టూరిజం శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి చోటు దక్కింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కేబినెట్ కమిటీలను ప్రధాన మంత్రి పునర్వ్యవస్థీకరించారు. జ్యోతిరాధిత్య సింథియా, భూపేందర్ యాదవ్, శర్వానంద సోనోవాల్ తదితరులతో పాటు కొత్త మంత్రులకు కీలక కేబినెట్ కమిటీల్లో చోటు దక్కింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో ప్రధాన మంత్రి మోదీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, గడ్కరీ నిర్మలాసీతారామన్, నరేంద్ర సింగ్, తోమర్, డాక్టర్ ఎస్.జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, అర్జున్ ముండా, ప్రహ్లాద్ జోషి, డాక్టర్ వీరేంద్ర కుమార్, కిరెన్ రిజిజు, అనురాగ్ సింగ్, ఠాకూర్ ఉన్నారు. సహాయ మంత్రులుగా అర్జున్ రామ్ మేఘ్వాల్, వీ మురళీధరన్‌లు ఈ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలో ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, శర్వానంద సోనోవాల్, గిరిరాజ్‌సింగ్, మన్‌సుఖ్ మాండవీయ, భూపేందర్ యాదవ్ ఉన్నారు. ఉపాది,ó నైపుణ్యాభివృద్ధి కేబినెట్ కమిటీలో కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా కిషన్‌రెడ్డికి చోటు దక్కింది.