జపాన్ తదుపరి ప్రధానిగా మాజీ విదేశాంగ మంత్రి ప్యుమియో కిషిదా బాధ్యతలు చేపట్టనున్నారు. లిబర్ డెమొక్రాటిక్ పార్టీ (ఎల్డిఎ) అధ్యక్ష ఎన్నికల్లో వ్యాక్సినేషన్ మంత్రి తారో కొనోతో తలపడి విజయం సాధించారు. దీంతో వచ్చే వారం ప్రధాని పదవి నుంచి వైదొలగనున్న యోషిహిడే సుగా వారసుడిగా కిషిదా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని సుగా గత సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అయితే కరోనాను ఎదుర్కోవడంలోనూ, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలోనూ ఘోరంగా విఫలమయ్యారు. దీనిపై సొంత పార్టీలో సైతం విమర్శలు రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.