Namaste NRI

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) బోర్డు నూతన చైర్మన్‌గా కిషోర్ కంచర్ల నియామకం

అమెరికాలో తెలుగు వారికి సేవలను అందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్ ) బోర్డు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కిషోర్ కంచర్ల ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ పామర్రు దగ్గర రిమ్మనపూడి గ్రామానికి చెందిన సినీ నిర్మాత దర్శకులు పూర్ణచంద్ర రావు -విజయ లక్ష్మి దంపతులకు జన్మించారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన కిషోర్ అక్కడ ఐటి రంగంలో వుంటూ హోటల్ బిజినెస్ లోకి వెళ్లి అమెరికాలో 2011లో డాలస్ లో బావర్చి హోటల్ ని ప్రారంభించి అనతి కాలంలోనే వేగంగా విస్తరించాడు. అమెరికా అంతటా 50 శాఖలను ఏర్పాటు చేశారు. నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించడమే తన విజయ రహస్యమని కిషోర్ చెబుతారు. తెలుగువారి రుచులను అమెరికాకు పరిచయం చేశారు.

కిషోర్ కంచర్ల ఐటి, హోటల్ వ్యాపారంతో పాటు అర్కాస్సా వెంచర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, సుమారు 600 మిలియన్ డాలర్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మార్బుల్ మైనింగ్, పినాకిల్ సర్ఫేసెస్ తో పాటు అలబామా , డాలస్, అట్లాంటా, ఐటి, కంపెనీలు, ఆరోగ్య రంగాల్లో సేవలను అందిస్తూ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. కిషోర్ తండ్రి పూర్ణ చంద్ర రావు సినీ నిర్మాత కావడంతో సినీ పరిశ్రమలో మంచి పరిచయాలు వున్నాయి. సంగీత దర్శకుడు ఇళయరాజ , సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, కీరవాణి,మణిశర్మ, ఆర్ బి పట్నాయక్, సింగర్ మను, దర్శకుడు రాఘవేంద్రరావు ,బి గోపాల్ తదితరులతో మంచి పరిచయం వుంది. సమాజానికి సంపాదించినది తిరిగి ఇవ్వాలని నమ్ముతారు అందుకే నాట్స్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక సంస్థ శాఖలను విస్తరించి సేవా కార్యక్రమాలు ఇంకా బలోపేతం చేస్తామని చెప్పారు. 2008 నుండి కిషోర్ కంచర్ల పలు పదవులలో ఉన్నారు. 2013 లలో డల్లాస్ నాట్స్ సంబరాలకు మద్దతు అందించారు, 2019 నాట్స్ తెలుగు సంబరాలకు కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. కోవిడ్ సమయంలోను ఆహార సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ వితరణ, సొంత ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.కిషోర్ కంచర్ల ఎదుగుదల లోనూ, సేవా కార్యక్రమాలలోను కుటుంబ సభ్యుల సహకారం చాలా వుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events