తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షునిగా కొల్లి రామకృష్ణ ఎన్నికయ్యారు. టీఎఫ్‌సీసీ కార్యవర్గ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (మెసర్స్ రిథమ్ డిజిటల్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్)ను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఏడాది జూలై 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. టీఎఫ్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో ఈ నెల 19న మృతి చెందిన సంగతి తెలిసిందే. కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఎం. రమేష్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
