హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరగుతుంది. వరంగల్‌లో కీలక నేతగా ఉన్న కొండా సురేఖకు పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు పడతాయని తెలంగాణ పీసీసీ భావిస్తోంది. అందుకే ఆమెకు టికెట్ ఇవ్వాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు కృష్ణారెడ్డి, కమలాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నాయి. అయితే చివరకు హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. బీజేపీ నుంచి ఈటెల పోటీ చేస్తారని ఎప్పుడో తేలిపోగా.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించింది. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.