Skip to main content

Namaste NRI

కొరియన్‌ కనకరాజు టీజర్‌ విడుదల

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ కొరియన్‌ కనకరాజు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉన్నది. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ ఈ టీజర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. రాయలసీమలోని పెనుగొండ ప్రాంతాన్ని పరిచయం చేస్తూ కనకరాజు వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ మొదలైంది. సరదాగా సాగే కనకరాజు జీవితం, ఓ కొరియన్‌ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఎలా మారింది? అనేది ఈ టీజర్‌లో ఆసక్తికరంగా సాగింది. ఆత్మలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కామెడీ, యాక్షన్‌, ఫాంటసీ హారర్‌ అంశాలతో ఈ కథ సాగుతుందని టీజర్‌ చెబుతున్నది. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియా వాతావరణాన్ని మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రితికా నాయక్‌ కథానాయిక. సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆగస్ట్‌ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. కెమెరా: మనోజ్‌ రెడ్డి, సంగీతం: తమన్‌.

Social Share Spread Message

Latest News