Namaste NRI

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి: అశోక్ గౌడ్ దూసరి

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని తెలంగాణ  రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ లండ‌న్ ఎన్నారై శాఖ కార్య‌వ‌ర్గం విజ్ఞ‌ప్తి చేసింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్ష తన జరిగిన కార్యవర్గ సభ్యులు హాజర‌య్యారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ  రానున్న పార్లమెం ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం ప్ర‌త్యేకంగా కృషి చేస్తామ‌ని తెలిపారు. గ‌త 100 రోజుల కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యలు, నీళ్ల సమస్యలు ప‌రిష్కారం కాలేద‌ని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయ‌ని  చెప్పారు. ఒక్క హామీ కూడా అమలుచేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజ‌ కవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్ర‌స్తుతం సోషల్ మీడియా ప్రభావం అభ్యర్థుల గెలుపులో ఎంతో కీలకంగా మారిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర సమస్యల పట్ల పార్లమెంట్ వేదికగా తెలంగాణ గొంతుకై పనిచేసేది అవసరమైతే పోరాటం చేసేది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్‌ ఎంపీలు మాత్రమేనన్నారు.

ఈ స‌మావేశంలో ఎన్నారై బి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజ‌రీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సిక్కా, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల, ఎన్నారై బీఆర్ఎస్‌ నాయకులు రవి ప్రదీప్ పులుసు, అబ్దుల్ జాఫర్, వెంకట్ రెడ్డి డొంతుల, సురేష్ గోపతి, వీర ప్రవీణ్ కుమార్, రమేష్ ఎసెంపెల్లి, రవి రేతినేని, సత్యపాల్ పింగిళి, పృథ్వీ రావుల, గణేష్ కుప్పలా, మధు యాదవ్ ఆబోతు తదితరులు  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events