Namaste NRI

కృష్ణారామా.. చాలా ప్రత్యేకమైన చిత్రం

డా.రాజేంద్రప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం కృష్ణా రామా. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవివర్మ, జెమినీ సురేశ్‌, రచ్చ రవి కీలక పాత్రధారులు. రాజ్‌ మాదిరాజు దర్శకుడు. వెంకట్‌ కిరణ్‌, కుమార్‌ కళ్లకూరి, హేమ మాధురి నిర్మిచిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. అన్ని జనరేషన్లకూ అడ్జస్ట్‌ అవ్వటం, అన్ని జనరేషన్స్‌తో కలిసి పనిచేసే అవకాశాలు రావటం నా అదృష్టం. ఇప్పుడు సినిమా నేరుగా ఇళ్లల్లోకి వచ్చేసింది. ఈ మార్పుకు తగ్గట్టు నన్నునేను మలచుకుంటున్నాను అన్నారు. కృష్ణా రామా చాలా ప్రత్యేకమైన సినిమా. దర్శకుడు రామ్‌ కథ చెప్పినప్పుడు సర్‌ప్రైజ్‌కి లోనయ్యాను. నేటి జనరేషన్‌కి ఇది తగిన కథ. సోషల్‌మీడియా ఇద్దరు వృద్ధదంపతుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందన్నదే ఈ సినిమా కథ. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా అవుతుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. ఎంతో మంది యువ ప్రతిభావంతులు పనిచేసిన మ్యాజికల్‌ బ్యూటిఫుల్‌ మోడ్రన్‌ ఫిలిం ఇదని నటి గౌతమి అన్నారు. రాజేంద్రప్రసాద్‌, గౌతమి లాంటి గొప్పనటులు దొరికినప్పుడు ఇక ఏ దర్శకుడైనా వెనక్కితిరిగి చూసుకోవాల్సిన పనుండదు. వారివద్ద ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈ సినిమా తీశాను అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రంగనాథ్‌ గోగినేని, సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events