అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ కస్టడీ. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఇందులో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజా పోస్టర్లో జైలు సెల్ బ్యాక్ డ్రాప్లో కనిపిస్తున్న కృతిశెట్టి లుక్ సస్పెన్స్ గా ఉంది. చీజ 22గా వస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది.
ఈ చిత్రంలో నాగచైతన్య శివ అనే పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ మూవీలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. కస్టడీలో వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కస్టడీ మూవీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.