టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకడు శర్వానంద్. కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది మంగళూరు సుందరి కృతిశెట్టి. తాజాగా ఈ భామ తెలుగులో భారీ ఆఫర్‌ను చేజిక్కించుకుంది. శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా కృతిశెట్టిని ఖరారు చేశారు. కృతిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని, శర్వానంద్ తన కెరీర్‌లోనే విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, రచన-దర్శకత్వం: కృతిశెట్టి.
