
బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. మంత్రిగా ఆయన హయాం లో చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచ పటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తి స్తూ, అంతర్జాతీయ వేదికలపై తన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా పిలుపువచ్చింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్య, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన ముద్ర వేసింది. అమెరికాలోని న్యూయార్ నగరంలో కొలంబియా బిజినెస్ సూల్‌లో ఏప్రిల్ 4న జరిగే 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (ఐబీసీ)లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సదస్సు నిర్వహించే విద్యార్థి విభాగం సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ (ఎస్‌ఏబీఏ) ఈ మేరకు ఆయనను ఆహ్వానించింది.















