Skip to main content

Namaste NRI

బిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కెటిఆర్ బర్త్‌ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు  నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో వినయ్ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. తెలగాణ అభివృద్ధికి అందరి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.  ఈ వేడుకల్లో  కోర్ కమిటీ నాయకులు సురేష్ మండ, రాకేష్, సూర్యారావు, అశోక్, బాలరాజు, మిస్కిన్,  ప్రవీణ్ లేదెళ్ల, వేణునాథ్, సాయి యాదవ్, ఉదయ్ ,సాయి కృష్ణ కల్వకుంట్ల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events