Namaste NRI

కువైత్ కీలక నిర్ణయం.. వారికి ఎలాంటి ఆంక్షలు లేవు

కువైత్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న వారికి ఎలాంటి కరోనా ఆంక్షలు లేవని ప్రకటించింది. ఈ మేరకు  ఆ దేశ ప్రధానమంత్రి షేక్‌ సభా ఖలేద్‌ అల్‌ హమద్‌ అల్‌ సభా మీడియా సమావేశంలో తెలిపారు. పెళ్లిలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు ఇతర వాటికి పరిమిత సంఖ్యలో హాజరు కావాలనే నిబంధనను కూడా తొలగించారు. కాకపోతే టీకాలు తీసుకున్న వారు మాత్రం ఇలా అపరిమిత సంఖ్యలో వివిధ కార్యక్రమాలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం మాత్రం తప్పనిసరి అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events