కువైత్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రవాస కార్మికుల పట్ల పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నైపుణ్యం లేని ప్రవాస కార్మికుల సంఖ్యను తగ్గించాలని యోచిస్తుందట. అంతర్గత మంత్రిత్వశాఖ ఇప్పటికే చర్యలు మొదలుపెట్టిందని సమాచారం. దీనిలో భాగంగా అవసరమైన వారికి తప్ప ఈ ఏడాది మరేవరికీ అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లేబర్ మార్కెట్‌కు అవసరం లేనిపక్షంలో వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేయబడవని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది.