కరోనా విజృంభణ నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కువైత్ కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసింది. అయితే మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను సడలించింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను కూడా తమ దేశంలోకి అనుమతిచ్చింది. దీంతో భారత్‌లోని ప్రవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను పొందాలని వెల్లడిరచింది. ఈ నేపథ్యంలో ప్రవాసులకు భారీ ఉపశమనం లభించింది.
