Namaste NRI

కువైత్ సంచలన నిర్ణయం…10వేల మంది ప్రవాసులను

గల్ఫ్ దేశం కువైత్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10వేల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది. కాగా, వీరందరూ వివిధ ఉల్లంఘనలకు పాల్పడినవారు అని సంబంధిత అధికారులు వెల్లడించారు. వీరిలో ఎక్కువగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘినవారు ఉన్నారని తెలిపారు. మూడు నెలల వ్యవధిలో ఈ పదివేల మందిని వివిధ దఫాలలో దేశం నుంచి పంపించివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, గత ఒక్క నెలలోనే 3వేల మంది వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ముఖ్యంగా ఈ తనిఖీలు మసాజర్లు, మత్స్యకారులు, రైతులు, స్క్రాప్ వర్కర్లు వంటి నైపుణ్యం లేని కేటగిరీ కిందకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని నిర్వహించడం జరుగుతుంది. కొన్ని ఏజెన్సీలు చట్ట విరుద్ధంగా కొంతమంది జాతీయులకు 2వేల కువైటీ దినార్లకు (రూ.5.36లక్షలు) వీసాలను విక్రయిస్తున్నాయని కమిటీ సోదాల్లో తేలింది. దాంతో అలాంటి ఈ ఏజెన్సీలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు కమిటీ పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events