ఒమన్ దేశంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం వైభోవోపేతంగా జరిగింది. దారసైత్‌లో ని శ్రీ కృష్ణ ఆలయంలో నర్సన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ప్రవాస తెలంగాణ వాసులు నిర్వహించారు. యాదగిరి గుట్ట ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు నేతృత్వంలో మంగళగిరి నర్సింహామూర్తి అర్చకుల బృందం ఆధ్వర్యంలో తిరుకల్యాణం సాగింది. ఓం నమో నారసింహాయే నామస్మరణతో గల్ఫ్ దేశం మార్మోగింది. ఈ సందర్భంగా అర్చకులు సీఎం కేసీఆర్ చేపట్టిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి గురించి ప్రవాసీలకు వివరించి, స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. ఆలయ సూపరింటెండెంట్ సురేంధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను గల్ఫ్ తీసుకువచ్చారు. సుమారు రెండువేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు.
