సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లక్ష్మీకటాక్షం. వినయ్, అరుణ్, దీప్తి వర్మ కీలక పాత్ర ధారులు. సూర్య దర్శకుడు. యు.శ్రీనివాసులరెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తంరెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానుగుణంగా ఈ ట్రైలర్‌లో ఎన్నికల వేడిని చూపించా రు. ప్రస్తుతం తెలుగురాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల తేదీనే ఈ ట్రైలర్‌లోనూ చూపిస్తూ, పాతికేళ్ల కెరీర్ నిలబెట్టుకోవాలని తపించే రాజకీయవేత్తగా సాయికుమార్ కనిపించారు. ఈ ట్రైలర్‌లో కొన్ని ఫాంటసీ ఎలిమెం ట్స్ కూడా ఉండటం గమనార్హం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని దర్శక, నిర్మాత లు నమ్మకం వ్యక్తం చేశారు. చరిష్మా శ్రీకర్, హరిప్రసాద్, సాయికిరణ్ ఏడిద, ఆమని తదితరులు కీలక పోషిస్తు న్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నని ఐనవెల్లి, సంగీతం: అభిషేక్ రుఫుస్.