
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని వనౌటు ప్రధాని జోథమ్ నపట్ ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. భారత్ నుంచి పారిపోయిన అతను తిరిగి స్వదేశానికి తనను అప్పగించకుండా ఉండేందుకే వనౌటు పాస్‌పోర్ట్ పొందారని నపట్ అన్నారు. ఈ నెల 7న తన భారతదేశ పాస్‌పోర్ట్‌ను అప్పగించేందుకు అనుమతి కోరుతూ లండన్‌లోని భారత హై కమిషన్‌కు లలిత్ మోదీ దరఖాస్తు చేశారు. అతను వనౌటు పౌరసత్వాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నట్టు తెలిసింది. భారత దర్యాప్తు సంస్థలు అతడి కోసం గాలిస్తున్నాయి.
