అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ యాప్ ట్రూత్ సోషల్ ప్రారంభమైంది. ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో విడుదలైంది. ఇందులో రాజకీయ వివక్ష ఉండదని యాప్‌ను రూపకల్పన చేసిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తెలిపింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్ టెస్టింగ్ కూడా పూర్తయింది. ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్‌లోనూ ఒకరినొకరు అనుసరించొచ్చు. ట్రెండిరగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. ట్విటర్‌లో పోస్ట్ చేసేవాటిని ట్వీట్ అంటూ. ట్రూత్ సోషల్ మీడియా యాప్‌లో మాత్రం ట్రూత్ అని సంబోధిస్తారు. ఈ యాప్ కోసం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో యాపిల్ ర్యాంకింగ్స్ ప్రకారం అమెరికాలో టాఫ్ ఫ్రీ యాప్ జాబితాలో ఈ యాప్ అగ్రస్థానంలో నిలిచింది.
గతంలో ట్రంప్ విద్వేష పోస్టులు చేస్తున్నారంటూ ప్రఖ్యాత సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిషేధించడం తెల్సిందే. దీంతో తన మద్దతుదారులకు సొంత సోషల్ మీడియా యాప్ ద్వారా చేరువవుతానని ట్రంప్ గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ అందుబాటులోకి వచ్చింది.