
రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల, నేహా పఠాన్ ప్రధాన పాత్రధారులుగా శశాంక్ దు వ్వూరు దర్శకత్వంలో డాక్టర్ దామోదర్ నేరేళ్ల నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, సైన్స్ ఫిక్షన్ అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందుతున్నదని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించి, వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణం: డీఆర్ఆర్ ప్రొడక్షన్స్.















