కల్యాణ్‌దేవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కిన్నెరసాని. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. నీ ముందు ఉన్న సముద్రపు అలల్ని చూడు.. కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్.. కానీ సముద్రం వాటిని వదలదు..వదులుకోలేదు.. నేను కూడా అంతే అని కథానాయిక శీతల్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ అందమైన ప్రేమకథా చిత్రమిది. మిస్టరీతో సస్పెన్స్‌ను పంచుతుంది. కల్యాణ్‌దేవ్ పాత్ర చిత్రణ వినూత్నంగా ఉంటుంది. సహజమైన ఉద్వేగాల్ని ప్రతిబింబిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పారు. సినిమాలో ఐదు కథలుంటాయని, హృదయానికి హత్తుకునే ఎమోషన్స్ ఉంటాయని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. రచయిత సాయి తేజ్ మాట్లాడుతూ కథ కంటే కథనం బగుండాలని యూనిక్‌గా రాసుకున్నాను కిన్నెరసాని అని చెప్పారు. చిత్ర నిర్మాత రవి మాట్లాడుతూ ఈ సినిమాకు అందరూ చాలా అంకితభావంతో చేశారు అని చెప్పారు. ఇంకా సినిమాటోగ్రఫర్ దినేష్, నటి కశిష్ ఖాన్, నటి మహతి బిక్షు, శీతన్, ఎడిటర్ అన్వర్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి రమణతేజ దర్శకుడు రజనీ తాళ్లూరి, రవి చింతల నిర్మాతలు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది.