Namaste NRI

రావణాసురలో లాయర్‌ కనక మహాలక్ష్మిగా కనిపిస్తా.. ఫరియా అబ్దుల్లా

టాలీవుడ్‌ యాక్టర్ రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం రావణాసుర. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా వన్ ఆఫ్‌ ది ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. అభిషేక్‌ నామా నిర్మాత. సుధీర్‌ వర్మ దర్శకుడు.   రావణాసుర ఏప్రిల్‌ 7న విడుదలకానుంది. అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ, సుశాంత్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫరియా అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ  ఈ చిత్రంలో కనకమహాలక్ష్మి అనే లాయర్‌ పాత్రలో కనిపిస్తాను.

జాతిరత్నాలు చిత్రంలోని లాయర్‌ తరహా పాత్ర కాదు. తనొక ఇల్లాలు. ఇందులో సీరియస్‌గా ఉంటుంది. హావభావాల్లో పరిణితి ప్రదర్శించా. నటించేందుకు ఆస్కారమున్న క్యారెక్టర్‌ ఇది. రవితేజ నాకు సీనియర్‌ లాయర్‌ పాత్రలో నటించారు. కథతో పాటు నా పాత్ర మారుతుంటుంది. నా కెరీర్‌ ఎలా ఉండాలి అనే అవగాహన ఉంది. అవకాశాలు రావేమో అనే భయం నాలో లేదు. దర్శకత్వం, నిర్మాణం చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. యాక్షన్‌, పీరియాడిక్‌ మూవీస్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో ఒక్కో సినిమాలో నటిస్తున్నాను  అని చెప్పింది.

Social Share Spread Message

Latest News