Skip to main content

Namaste NRI

సీఐఐ సమ్మిట్‌లో నేతల సందడి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేదికపై ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్‌లను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సదస్సు ప్రాంగణంలోని వివిధ స్టాళ్లను ప్రముఖ నాయకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

సదస్సు ప్రాంగణానికి విచ్చేసిన ప్రముఖులకు రాష్ట్ర సంప్రదాయ కళారూపమైన ధింసా, తప్పెటగుళ్లు నృత్యాలతో ఘనమైన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానిక కళాకారులను ఉత్సాహపరిచేందుకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా డోలు వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రత్యేక క్షణాలు సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events