శరవణన్ హీరోగా నటిస్తున్న నిర్మిస్తున్న సినిమా ది లెజెండ్. ఊర్వరీ రౌటేలా నాయికగా నటిస్తున్నది. విదేశాల్లో మైక్రోబయాలజీలో డాక్టరేట్ పూర్తి చేసిన ఓ యువకుడు తన స్వగ్రామంలో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినప్పుడు అక్కడ అతను చూసిన పరిస్థితులు ఏమిటి? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథాంశంగా చూపించబోతున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్‌ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆమె చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. వివేక్, యోగాబాబు, సుమన్, నాజర్, విజయ్ కుమార్, ప్రభు తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్నారు. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జేడీ, జెర్రీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్దమవుతున్నది. శ్రీలక్ష్మి మూవీస్ సంస్థ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్రాజ్, సంగీతం: హారీస్ జయరాజ్.














