డిసెంబర్ 16న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా కళారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ రంగానికి విశేష సేవలందించిన లెజెండ్స్‌కు పురష్కారాలు అందజేయనున్నట్టు తెలిపారు.

పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజాదేవి. పద్మశ్రీ దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారాల గ్రహీత విశ్వనాథ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు మురళీ మోహన్, గిరిబాబు, కృష్ణవేణి, జమునా రాణి, లక్ష్మి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు తానా పురస్కారంతో సన్మానించనున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి, తానా చైనత్య స్రవంతి కో ఆర్డినేటర్ ప్రాంతా సునీల్ తెలిపారు.

సినీ ప్రముఖులను తానా తరపున ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు అన్నమాచార్య భవన వహిని, గురు రామచారి లిటిల్ మ్యూజీషియన్స్, సిద్దేంద్ర కూచిపూడి అకాడమీ, అమెరికాకు చెందిన 300 మందికి పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.