ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55) ఇక లేరు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత డిసెంబర్ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా ఆసుపత్రికి తరలించారు. గత కొద్దిరరోజులుగా ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జన్మించారు. తొలిసారిగా ఆయన 11 సంవత్సరాల వయసులో రంగస్థల ప్రదర్శన న్విహించారు. ఆ తర్వాత సినిమాల్లోనూ ఆయన పాటలు పాడారు. జబ్ వి మెట్‌లో ఆయన ఆవోగే జబ్ తుమ్ సాజ్నా అనే పాట బాగా పాపులర్ య్యింది. ఆయన ఉస్తాద్ అమీర్ ఖాన్, పండిట్ భీంసేన్ జోషి సంగీతానికి ప్రభావితుడయ్యారు. సినిమాల్లో ఆయన పాడిన పాటల్లో తెరే బినా మోహే చైన్ సూపర్‌హిట్ పాటను ఆలపించారు.
షారుఖ్ ఖాన్ హిట్ ఆఫ్ ది ఇండస్ట్రీ మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రంలోనూ అల్లా హాయ్ రెహెమ్ పాటపడారు. రాజ్-3, కాదంబరి, షాదీ మే జరూర్ ఆనా, మంటో తదితర చిత్రాల్లోనూ గాత్రంతో అలరించారు. అలాగే బెంగాలీ పాటలను సైతం స్వరపరిచారు. దశాబ్దాల పాటు తనగాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసిన ఉస్తాద్ రషీద్ ఖాన్ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషన్ అదుకున్నారు. రషీద్ ఖాన్ మృతికి పలువురు సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులర్పించారు.