విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లియో. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ లియో సినిమా విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని, ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుందని చెప్పారు. తెలుగు టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. ఈ టైటిల్‌ను వేరొకరు రిజిస్టర్ చేయించుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుకెళ్లారు. ఈ విషయం మాకు మీడియా ద్వారా తెలిసింది. వారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారమవుతుంది. సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. మా సినిమాకు థియేటర్లు కావాల్సినన్ని కేటాయించారు అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/01-454-1024x576.jpg)