ఎస్తర్, శృతి శరణ్, అవయుక్త, వంశీ పాండ్య నటిస్తున్న చిత్రం లేతాకులు. చంటి గాణమని దర్శకత్వంలో వెంకటేష్ చిక్కాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు క్లాప్ ఇవ్వగా, మోహన్ వడ్లపట్ల కెమెరా స్విచాన్ చేశారు. తమ్ముడు సత్యం స్క్రిప్ట్ అందించగా, వి.వి.సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఇండియన్ హిస్టరీలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని, ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చే కథ ఇదని, ఎస్తర్ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని నిర్మాత చెప్పారు.
దర్శకులు చంటి గాణమని మాట్లాడుతూ నూతిలో కప్పలు సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా లేతాకులు. ఒకరిని బాధ పెట్టిన వారికి ఏదో శిక్ష విధించడం శిక్ష కాదు అదే బాధ వాళ్ళకి కలిగాలా చేయడమే అసలైన శిక్ష అని అండర్ కరెంట్‌గా చెప్పే కథ ఇది. మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ దర్శకులు చంటి గాణమని చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నేను చేసిన సినిమాలతో పోల్చితే ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. నా కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాకు కెమెరా: మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: సుక్కు.