శ్రీలంకలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో మాజీ ప్రధాని మహీంద రాజపక్స తనయుడు, ఎంపీ నమల్ రాజపక్స స్పందించారు. సోమవారం జరిగిన దురదృష్టకర ఘటనలకు సంబంధించి ఎలాంటి దర్యాప్తుకైనా పూర్తిగా తాము సహకరిస్తామన్నారు. శ్రీలంకను విడిచి పారిపోవాలనే ఉద్దేశం తనకు గానీ, తన తండ్రికీ గానీ లేదని, శ్రీలంకలోనే ఉంటామని పేర్కొన్నారు. శ్రీలంకలో విద్వేషాన్ని హింసను ప్రేరేపించిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసిన వారే వాటికి జవాబుదారీ చేయాలన్నారు. వికృత గుంపుల చేష్టలకు బాధితులుగా మారిన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.