ముంబయి ఉగ్రదాడుల (26/11 దాడులు) కేసులో ప్రమేయమున్న పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా వ్యాపారావేత్త తహవ్వూర్ రానాను భారత్‌కు అప్పగించేందుకు అనుమతించాలంటూ బైడెన్ యంత్రాంగం ఫెడరల్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. 59 ఏళ్ల రానాను పరారీలో ఉన్న నిందితుడిగా భారత్ ఇప్పటికే ప్రకటించింది. భారత్ అభ్యర్థన మేరకు అమెరికా పోలీసులు గతేడాది జూన్ పదో తేదీన లాస్ ఏంజెల్‌స్‌లో రానాను అరెస్టు చేశారు. మరోవైపు అప్పగింత కోరుతూ భారత్ సమర్పించిన అభ్యర్థనలో రానాపై మోపిన ప్రతి అభియోగం పైనా సముచితమైన ఆధారం ఉందని, అందువల్ల అతడిని భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లోని న్యాయస్థానంలో అమెరికా ప్రభుత్వం తాజాగా వాదనలు వినిపించింది.