Namaste NRI

బ్రిట్నీ స్పియర్స్ కు విముక్తి ..తన జీవితంలో ఇదే

ప్రముఖ పాప్‌ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్‌కు స్వేచ్ఛ లభించింది. ఆమె చేస్తున్న న్యాయ పోరాటం  ఫలించి తండ్రి జేమ్స్‌ స్పియర్స్‌ నుంచి విముక్తి దొరికింది.  13 ఏళ్ల తర్వాత తన జీవితంలో ఇదే అత్యుత్తమ రోజు అని ఆమె అన్నది. ఈ మేరకు జేమ్స్‌ గతంలో పొందిన సంరక్షణ బాధ్యతలు రద్దు చేస్తూ అమెరికాలోని లాస్‌  ఏంజెలెస్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బ్రిట్నీ 2008లో మానసిక సమస్యలకు గురువడం  వల్ల ఆమె సంరక్షణ బాధ్యతలను తండ్రి జేమ్స్‌ చేపట్టారు. అప్పటి నుంచి కుమార్తె జీవిత నిర్ణయాలను, డబ్బులు, ఆస్తుల నిర్వహణను పర్యవేక్షిస్తూ వచ్చారు. అయితే తన స్వేచ్ఛకు తండ్రి జేమ్స్‌ ఆటంకంగా మారారని, సంరక్షణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని కొంతకాలంగా బ్రిట్నీ న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. దీంతో తాజాగా జేమ్స్‌ను సంరక్షకుడిగా తప్పిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కోర్టు వద్దకు భారీగా చేరుకున్న బ్రిట్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events