సాయిరోనక్, బాబా భాస్కర్, రిచా పనాయ్, అర్షిణ్ మెహతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సర్కిల్. ఈ చిత్రానికి నీలకంఠ దర్శకుడు. ఎం.వి. శరత్చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ సంయుక్తంగా నిర్మించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిచా పనాయ్ మాట్లాడుతూ గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసినా నా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. సర్కిల్ లో నా పాత్రను నీలకంఠ సరికొత్త రీతిలో తీర్చిదిద్దారు. బోల్డ్‌గా కనిపిస్తాను. నటిగా నాకు మంచి పేరు తెస్తుంది. హీరో జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. రొమాన్స్, యాక్షన్, థ్రిల్ ఉన్నాయి. నా తదుపరి సినిమాల కోసం కథలు వింటున్నాను అని చెప్పారు.
అర్షిణ్ మెహతా మాట్లాడుతూ సల్మాన్‌ఖాన్ భజరంగీ భాయిజాన్ చిత్రంతో నటిగా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ నాకు తొలి తెలుగు చిత్రం. ఇందులో నా ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుంది. మన జీవితం మంచీ చెడుల సర్కిల్. ఈ చిత్రంలో అదే విషయాన్ని చెప్పబోతున్నాం అన్నారు. ఈ సినిమా జులై 7న విడుదల కానుంది.