Namaste NRI

లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా!

అనిల్‌ రావిపూడి దర్శకతంలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌3. తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, పూజాహెగ్డేలపై ఇందులో ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా అంటూ వాళ్లు చేసిన హంగామా ఎలా సాగిందో త్వరలోనే తెలిసిపోనుంది. పూజాహెగ్డేతో కలిసి ప్రత్యేక గీతంలో ఆడిపాడారు, ఆ గీతానికి సంబంధించిన లిరికల్‌ వీడియోని ఈ నెల 17న విడుదల చేస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ గీతం పార్టీ సాంగ్‌గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని సినీ వర్గాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సహనిర్మాత: హర్షిత్‌ రెడ్డి, నిర్మాత: శిరీష్‌, సమర్పణ: దిల్‌రాజు, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events