హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ స్వయంభూ. సంయుక్తమీనన్ ఒక కథానాయిక. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం. భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిఖిల్ యుద్ధవీరుడిగా నటిస్తున్నాడు. సంయుక్తమీనన్ తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. ఇందులో మరో కథానాయికగా నటిస్తున్న నభా నటేష్‌కు ఈ సినిమా షూటింగ్‌లోనే చేతికి గాయం కాగా, అది నయం కావడంతో ఆమె మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. మేకర్స్ ఈ సినిమాలోని ఆమె లుక్‌ని విడుదల చేశారు. గాయం నుంచి కోలుకొని టీంలో చేరినట్టు వీడియోలో ప్రజెంట్ చేశారు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో నభా యువరాణిలా కనిపిస్తున్నది. చీరలో, నగలతో అత్యంత మనోహరంగా కనిపిస్తున్నది నభానటేష్. ఇందులో నభాది శక్తిమంత మైన పాత్ర అని లుక్ చెప్పకనే చెబుతున్నది. అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటలు: వాసుదేవ్ మునెప్పగారి, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.